top of page

విద్యార్థులే స్వచ్ఛ ప్రొద్దుటూరుకు రేపటి మార్గదర్శకులు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 18
1 min read

విద్యార్థులే స్వచ్ఛ ప్రొద్దుటూరుకు రేపటి మార్గదర్శకులు


అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో స్వచ్ఛతా హీ సేవా – 2వ రోజు కార్యక్రమం


ప్లాస్టిక్‌ నివారణపై విద్యార్థులకు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అవగాహన

ప్రొద్దుటూరు, 18.09.2026, ఉదయం 10:30 గంటలకు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ విద్యార్థులతో ముచ్చటిస్తూ, భారతదేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర, సమాజ నిర్మాణంలో యువత బాధ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించారు.


పట్టణ పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, చెత్తను తడి–పొడి రకాలుగా వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించడం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి తన ఇంటి నుంచి స్వచ్ఛతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, కుటుంబ సభ్యులు మరియు పరిసర ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు.


ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి, స్వచ్ఛత, ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ పరిరక్షణపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. నేటి విద్యార్థులలో స్వచ్ఛతపై అవగాహన పెంపొందించడం ద్వారా రేపటి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page