ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
- VOICE OF HERALD

- May 17, 2022
- 1 min read
కడప జిల్లా బద్వేలు మండలం గుండంరాజు పల్లె లో విషాదం చోటుచేసుకుంది తన ఫ్రెండ్స్ తో ఈతకు వెళ్లి బావిలో పడి విద్యార్థి మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే కడప జిల్లా బద్వేలు మండలం గుండంరాజు పల్లి కి చెందిన పెంచలయ్య నరసమ్మ లకు చెందిన నరేంద్ర 18 సంవత్సరాల యువకుడు ప్రొద్దుటూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు తమ గ్రామంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ట చేసి నలభై రోజుల సందర్బంగా గ్రామంలో జాతర జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరుకి చెందిన తన ఫ్రెండ్స్ తో గ్రామానికి వచ్చి లక్ష్మీ పాలెం సమీపంలోని పంట పొలాల్లోని బావిలో ఈతకు వెళ్లారు.
సరదాగా ఈతలాడుతున్న సమయంలో నరేంద్ర బావిలో పడి గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు బావిలో గాలించినా ఫలితం లేకపోవడంతో విషయం బంధువులకు సమాచారం అందించారు దీంతో అక్కడికి చేరుకున్న బంధువులు ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు ఎట్టకేలకు ఫైర్ సిబ్బంది బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు అప్పటికే నరేంద్ర మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు..రోడ్డుకు కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుంచి నరేంద్ర బ్రతికే ఉన్నాడనే ఆలోచనతో నరేంద్ర ను భుజాన వేసుకుని పరుగులు పెట్టారు బంధువులు అయినా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. నరేంద్ర తండ్రి జీవనోపాధి కోసం కువైట్ కు వెళ్లాడు తన కుమారుడు మృతి చెందారన్న విషయం తెలుసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు తండ్రి పెంచలయ్య .పండుగ రోజు విషాదం జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



Comments