top of page

ప్రొద్దుటూరులో కోట్ల రూపాయల భూ దందా: టీడీపీ సంచలన ఆరోపణలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 41 minutes ago
  • 1 min read

ప్రొద్దుటూరులో కోట్ల రూపాయల భూ దందా: టీడీపీ సంచలన ఆరోపణలు

సమావేశంలో మాట్లాడుతున్న నల్లబోతుల నాగరాజు
సమావేశంలో మాట్లాడుతున్న నల్లబోతుల నాగరాజు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు ప్రొద్దుటూరులో జరిగిన ప్రెస్ మీట్ లో వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. "ప్రొద్దుటూరులో వెలుగులోకి వైట్ కాలర్ భూ దండాలు .. రూ. కోట్ల విలువైన భూములే లక్ష్యం!" అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.


శ్రీనివాస్ నగర్ భూమిపై కన్ను - ఫోర్జరీ కేసులో హాజరయ్య పాత్ర


నాగరాజు మాట్లాడుతూ "శ్రీనివాస్ నగర్‌లోని ఖరీదైన భూమిపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అనుచరులు" అని ఆరోపించారు. "అధికారుల సీళ్లు, సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులో కీలక సూత్రధారి హాజరయ్య" అని తెలిపారు. ఈ "భూ దందాల్లో హాజరయ్య కీలక పాత్ర" పోషించారని, ఆ భూమిని "రాచమల్లు సోదరుడు కిరణ్‌కు అప్పగించినట్లు ఆరోపణలు" ఉన్నాయని చెప్పారు. "అధికారం లేకపోయినా పని పూర్తి చేసి 2.5 కోట్లు ఇచ్చినట్లు స్వయంగా వెల్లడించిన హాజరయ్య" అని నాగరాజు వెల్లడించారు. అంతేకాకుండా "ప్రొద్దుటూరులోని ఖాళీ స్థలాల సమాచారం మొత్తం హాజరయ్య వద్దే లభ్యం" అవుతుంది అని ఆయన అన్నారు.


అరెస్ట్ తర్వాత ఒత్తిళ్లు - స్టేషన్ వద్ద బెదిరింపులు


"ఈ నెల 13న హాజరయ్య అరెస్ట్" అయ్యారని గుర్తు చేసిన నాగరాజు, "ఆయన వద్ద ఉన్న డబ్బును ఎందుకు రికవరీ చేయలేదు?" అని ప్రశ్నించారు? "హాజరయ్య స్టేషన్‌లో ఉన్నప్పుడు అధికారులకు ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చింది నిజం కాదా?" అని అనుమానం వ్యక్తం చేశారు. ఇంకా "స్టేషన్‌కు వెళ్లే ధైర్యం చేసి హాజరయ్యను కలిసి మాట్లాడిన మాజీ కౌన్సిలర్" అని అన్నారు. "వైసీపీ హయాంలో హాజరయ్యను అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయల భూములు కబ్జా" చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


మీడియా పక్షపాతం - సమగ్ర విచారణకు డిమాండ్


ఈ భూ వ్యవహారంపై మీడియా తీరును తప్పుబట్టిన నాగరాజు, "ఒకే ప్రభుత్వ భూమిపై రోజుకోలా కథనాలు రాయడం ఒక్క వైసిపి వారి పత్రికకే చెల్లింది" అని విమర్శించారు. కేసుపై తమ డిమాండ్ ను వెల్లడిస్తూ "రిమాండ్‌లో ఉన్న హాజరయ్యను కస్టడీకి తీసుకుని సమగ్ర విచారణ జరపాలి" అని డిమాండ్ చేశారు. చివరగా "త్వరలోనే హోం మంత్రిని కలసి ఫిర్యాదు చేస్తాం" అని హెచ్చరించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page