top of page

ప్రొద్దుటూరు అభివృద్ధికి కృషి చేయండి - రీజినల్ డైరెక్టర్ నాగరాజు

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 29
  • 1 min read

ప్రొద్దుటూరు అభివృద్ధికి కృషి చేయండి - రీజినల్ డైరెక్టర్ నాగరాజు

అనంతపురం ఆర్.జే.డి కార్యాలయంలో డైరెక్టర్ నాగరాజును మర్యాద పూర్వకంగా కలిసిన కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్
అనంతపురం ఆర్.జే.డి కార్యాలయంలో డైరెక్టర్ నాగరాజును మర్యాద పూర్వకంగా కలిసిన కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్

ప్రొద్దుటూరు : ప్రజల ఆకాంక్ష మేరకు సంతృప్తికర స్థాయిలో నిబంధనలు ప్రకారం విధులు నిర్వహించాలని రీజినల్ డైరెక్టర్ & అర్బన్ డెవలప్మెంట్ అప్పల్లెట్ డైరెక్టర్ గుజ్జుల నాగరాజు ప్రొద్దుటూరు కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సూచించారు. అనంతపురం ఆర్.జే.డి కార్యాలయంలో డైరెక్టర్ నాగరాజును మర్యాద పూర్వకంగా కలిసిన కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ ను ఉద్దేశించి కమీషనర్ కు పలు సూచనలు చేసారు. సందర్బంగా ఆర్.జే.డి మాట్లాడుతూ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడంతో పాటుగా సకాలంలో సిబ్బంది కార్యాలయం విధులకు హాజరయ్యేలా చూడాలని అన్నారు. వార్డు సచివాలయాలు సందర్శించి సచివాలయం సిబ్బంది పనితనాన్ని మెరుగుపర్చి ప్రజలకు సత్వర సేవలు అందేలా చూడాలని అన్నారు. మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్న పెట్రోల్ బంకు నిర్వహణలో అక్రమాలు జరిగి కోటి రూపాయలు పైబడి ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని, సంబంధతి భాద్యులు నుంచి వీలైనంత త్వరగా రికవరీ చేయించాలని ఆర్.జే.డి కమీషనరుకు సూచించారు. త్రాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వాహణకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజల, ప్రభుత్వం నుంచి మన్ననలు పొందాలని సూచించారు. కమీషనర్ వెంట రెవిన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ ఉన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page