top of page

శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో లలితా సహస్ర విష్ణు నామార్చన

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 30, 2024
  • 1 min read

శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో లలితా సహస్ర విష్ణు నామార్చన

కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు పట్టణ శాస్త్రి నగర్ నందు వెలసిన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం నందు శ్రావణమాస ఆఖరి శుక్రవారం కావటం చేత శ్రీశ్రీశ్రీ మౌనస్వామి ఆధ్వర్యంలో భూతూరు వెంకటరామిరెడ్డి పర్యవేక్షణలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆలయ కమిటీ వారు 300 మంది మహిళా భక్తులచే 5వేల సార్లు లలితా సహస్ర విష్ణు నామార్చన ఏర్పాటు చేశారు. ముందుగా ఆలయ అర్చకులచే ఆలయంలో వెలసిన శ్రీచక్రానికి కుంకుమార్చన పూర్తిచేసిన అనంతరం, వందలాదిగా పాల్గొన్న మహిళా భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు శాస్త్రోక్తంగా లలితా సహస్ర నామార్చన చేసారు. అనంతరం అమ్మవారి కుంకుమాది తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వందలాదిగా మహిళా భక్తులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page