top of page

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి: ఆలయంలో ప్రత్యేక పూజలు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 4
1 min read

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి: ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు స్థానిక శాసనసభ్యులు (MLA) నంద్యాల వరదరాజులరెడ్డి శ్రీకృష్ణాలయంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, స్వామివారికి విశేష అర్చనలు జరిపించి నియోజకవర్గ ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.


పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, బాలసుబ్బరాయుడు మరియు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని, ఇతర ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు, ఆలయ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page