ప్రొద్దుటూరులో శ్రీ చౌడేశ్వరి మాత జన్మదిన వేడుకలు - అన్నదానంలో పాల్గొన్న వైయస్ఆర్సీపీ నేతలు
- VOICE OF HERALD

- 5 days ago
- 1 min read
ప్రొద్దుటూరులో శ్రీ చౌడేశ్వరి మాత జన్మదిన వేడుకలు - అన్నదానంలో పాల్గొన్న వైయస్ఆర్సీపీ నేతలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
శ్రీ చౌడేశ్వరి మాత జన్మదిన సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం ఆనాబంకు వద్ద గల శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు పాతకోట వంశీధర్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు ద్వార్శల గురునాథ్ రెడ్డితో పాటు పలువురు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థనలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి.





Comments