top of page

ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 19
1 min read

ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలోని ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందిస్తూ, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించి ప్రజల సంతృప్తిని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పిలుపునిచ్చారు. శనివారం వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సచివాలయాలకు వచ్చే ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని, ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కార వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.


ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వ ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ విధానం అమలవుతున్న నేపథ్యంలో, ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కమిషనర్ సూచించారు. సచివాలయానికి వచ్చే పౌరులతో మర్యాదపూర్వకంగా, ఓపికగా వ్యవహరించి, వారి సమస్యలను సానుభూతితో ఆలకించి పరిష్కరించినప్పుడే పాలనపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. సత్వర స్పందన, నాణ్యమైన సేవలు అందించడం ద్వారా మున్సిపల్ యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావాలని, అధికారులు మరియు సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఆయన స్పష్టం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page