top of page

నారా లోకేష్ పుట్టినరోజున ప్రత్యేక పూజలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jan 23, 2024
  • 1 min read

నారా లోకేష్ పుట్టినరోజున ప్రత్యేక పూజలు.

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్బంగా మంగళవారం ఉదయం చిట్వేలి భక్తాంజనేయ దేవస్థానం నందు టిడిపి మండల యువ నాయకులు కాకర్ల నాగార్జున ఆధ్వర్యంలో లోకేష్ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్రంలో ప్రజా సమస్యల పై గళమెత్తి "యువగళం" పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు రానున్నది మన ప్రజా ప్రభుత్వమేనన్న మీ బాధలు తీరుస్తాను అని భరోసా ఇచ్చి ప్రజల పక్షాన నిలిచిన మా యువ నాయకులు నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి రాజకీయంగా ప్రజలకు మరింత సేవలు చేయాలని భగవంతుని కోరుకున్నట్లు యువ నాయకుడు నాగార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page