top of page

పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 15, 2023
  • 1 min read

పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

సూచనలు చేస్తున్న ఎస్పి రెడ్డి గంగాధరరావు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


శనివారం రాజంపేట లోని అర్బన్ పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ డిఎస్పి కార్యాలయాలను జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధరరావు తనిఖీ ఆకస్మికంగా చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గంగాధర్ రావు పోలీసు అధికారులతో మాట్లాడుతూ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని సూచించారు. స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని, స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డిఎస్పీ శివ భాస్కర్ రెడ్డి, అర్బన్ సీఐ నరసింహారావు, రూరల్ సీఐ పుల్లయ్య, అర్బన్ ఎస్సైలు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రూరల్ ఎస్సై భక్తవత్సలం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page