ప్రశాంత వాతావరణంలో ముగిసిన సోమలవారి పల్లె గ్రామ పంచాయతీ ప్రజాభిప్రాయ సేకరణ
- VOICE OF HERALD

- Jul 30
- 1 min read
ప్రశాంత వాతావరణంలో ముగిసిన సోమలవారి పల్లె గ్రామ పంచాయతీ ప్రజాభిప్రాయ సేకరణ


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
పొద్దుటూరు గ్రేడ్ వన్ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా పరిగణించే దిశగా గత కొద్ది రోజుల నుండి మున్సిపాలిటీ చుట్టుప్రక్కల ఉన్న ఐదు పంచాయతీలను ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసే దిశగా పంచాయతీ ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ అధికారులు చేపట్టిన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో నాలుగు పంచాయితీల ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కాగా, నేడు సోమలవారి పల్లె పంచాయితీని మున్సిపాలిటీలో విలీనంపై అధికారులు మంజుల వాణి అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. సానుకూల, ప్రతికూల అభిప్రాయాలను నమోదు చేసిన అధికారులు, పంచాయితీలు మున్సిపాలిటీలో విలీనం అయితే కలిగే ప్రయోజనాలను, ఎదురయ్యే సవాళ్లను, లాభనష్టాలను అధికారులు ప్రజలకు వివరించారు. అలాగే పలువురు గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు కూడా సందేహాలను నివృత్తి చేస్తూ వారికి సమాధానాలు ఇచ్చిన అధికారులు, విలీనానికి సానుకూలంగా ఉన్న వారి కోసం ఒక రిజిస్టర్, ప్రతికూలంగా ఉన్నవారికి మరొక రిజిస్టర్ ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సంతకాల రూపంలో నమోదు చేశారు. గ్రామసభ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ దశతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లోకి పంచాయతీల విలీన గ్రామసభలు, ప్రజల అభిప్రాయ సేకరణ పూర్తి అయింది. సంతకాలు నమోదు చేసిన రిజిస్టర్ లను డిపిఓ కు పంపనున్నట్లు ప్రత్యేక అధికారి మంజుల వాణి తెలియజేశారు.





Comments