top of page

ప్రవీణ్ రెడ్డిని పరామర్శించిన సోమిరెడ్డి, శ్రీనివాసుల రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 1, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు


శనివారం ఉదయం ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసి విడుదల చేయగా, ప్రవీణ్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించటానికి టీడీపీ కడప జిల్లా ఇంచార్జి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కడప పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసుల రెడ్డిలు ఆయన స్వగృహానికి చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ, పోలీసులు బలవంతంగా ప్రవీణ్ ను నిలువరించారని, మూడున్నర సంవత్సరాల్లో ప్రొద్దుటూరులో అవినీతి హెచ్చుమీరిందని, ప్రభుత్వం లో పోలీసు వ్యవస్థ ఒకవైపే పనిచేస్తోందని మండిపడ్డారు. ఇకపై ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే ప్రవీణ్ కుమార్ రెడ్డికి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సంఘీభావం ప్రకటించి ప్రొద్దుటూరు వస్తాం అని, మొన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి ర్యాలీ చూసి ఎమ్మెల్యే కు మింగుడు పడడం లేదని, ఎమ్మెల్యే రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ఇకనైనా మానుకోవాలి అని హితవు పలికారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page