కొత్తపల్లె లో సామాజిక శంఖారావం అధ్యయన యాత్ర
- VOICE OF HERALD

- Jul 27
- 1 min read
ప్రొద్దుటూరు మండల రూరల్ లో కొత్తపల్లె లో సామాజిక శంఖారావం అధ్యయన యాత్ర

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు, పాలాజీ శేఖర్ కార్యదర్శి గుర్రం డేవిడ్ రాజ్, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్ లు కొత్తపల్లె సచివాలయం వద్ద ప్రజలను సమీకరించి నిరసన వ్యక్తం చేసి అనంతరం పంచాయతీ కార్యదర్శి హేమంత్ కుమార్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ
పొద్దుటూరు మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అమృత నగర్ కాలనీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్ని మారిన నాయకులు మారుతున్నారు కానీ ఇక్కడి ప్రజల కష్టాలు మాత్రం అలాగనే ఉన్నాయని, అమృత నగర్ లో సైడ్ కాలువలు, వీధిలైట్లు, సరైనా రోడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ కాలువలు మురికి నీరు రోడ్లమీద ఇళ్ల మధ్య వుండి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. అలగే విష సర్పాలు జనావాసాల మధ్య తిరుగుతున్నా, సరైన రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు లేకపోవడం వల్లనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారనీ సరైన తాగునీరు ప్రజలకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే అల్లరి మూకలు అమృత నగర్ చుట్టుపక్కల ఉంటున్నారు వారిని కట్టడి చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజా సమస్యల తీర్చాలని ప్రజల తరఫున డిమాండ్ చేశారు, లేని పక్షంలో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ప్రజలు వారి సమస్యలు తీర్చే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల సహాయ కార్యదర్శి నోవా, సుమన్, గురమ్మ, లక్ష్మి, సుజాత, అయేషా, తదితరులు పాల్గొన్నారు.





Comments