top of page

ఆంపెర్ ఎలక్ట్రికల్ నూతన బైక్ వేరియంట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 21, 2023
  • 1 min read

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని మైదుకూరు రోడ్డులోని సిరి మోటార్స్ ఎలక్ట్రికల్ బైక్స్ షోరూం నందు మంగళవారం సాయంత్రం రెండు నూతన వేరియంట్ల ఎలక్ట్రికల్ బైకులను సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆవిష్కరించి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం యజమాని గోసంగి సుబ్బిరెడ్డి సతీసమేతంగా సర్పంచ్ కొనిరెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా కొనిరెడ్డి మాట్లాడుతూ ముందుగా నూతన వేరియంట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన సిరి మోటార్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపార అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిరి మోటార్స్ యాజమాన్యం, సిబ్బంది, పలువురు బైక్ యజమానులు, ఔత్సాహిక కొనుగోలుదారులు పాల్గొన్నారు.

ఆసక్తిగల ఎలక్ట్రికల్ వాహన కొనుగోలుదారులు తమను 9966466406 నంబర్ పై సంప్రదించి వాహనాలను బుక్ చేసుకోవలసిందిగా సిబ్బంది కోరారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page