top of page

మాంసాహార ప్రియులకు శుభవార్త

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Jun 10, 2022
1 min read

Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు / ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సంప్రదించండి - 9912324365


మాంసాహార ప్రియులకు శుభవార్త

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు ప్రజలకు టీ, కాఫీ, టిఫిన్, మీల్స్, బిరియాని, చిరుతిళ్ళ రుచులకు కొదవలేదు, ఇక్కడి ప్రజలు వివిధ ప్రాంతాలలో ఉన్నప్పటికీ, తిండి విషయం వచ్చేసరికి 'మా ప్రొద్దుటూరులో' అంటూ మొదలు పెట్టి వారు ఆస్వాదించిన రుచులను అక్కడి మిత్రులతో పంచుకుంటారు. బిరియానీలో ఒక ప్రత్యేకమయిన రుచిని ఇక్కడి ప్రజలకు చూపించి వారి ఆదరాభిమానాలు పొందింది మాత్రం 'షుకూర్ బిరియాని' అనే చెప్పాలి. ఇక్కడి వంట వారు చేసిన బిరియాని ప్రత్యేకమయిన రుచి సంతరించుకొని మాంసాహార ప్రియుల మనసును దోచేస్తుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ప్రత్యేకించి ప్రొద్దుటూరు ప్రజలు దూర ప్రాంతాలలోని తమ స్నేహితులను లేదా బంధువులను కలవటానికి వెళ్ళేటప్పుడు 'షుకూర్' కుండ బిరియాని ప్రత్యేకంగా పార్సల్ చేయించి తీసుకెళ్తారు. అది మరి షుకూర్ బిరియాని ప్రత్యేకత. మరి ఎందుకు ఇవన్నీ ఇప్పుడు చెబుతున్నాను అంటారా... స్థానిక సుందరాచార్యుల వీధిలో గత కొద్ది సంవత్సరాల క్రితం మూతపడ్డ షుకూర్ బిరియాని సెంటర్ నేడు పునః ప్రారంభం అయినది. గతంలో షుకూర్ బిరియాని సెంటర్ యజమాని అనారోగ్య కారణాల వలన మరణించగా, అతని తమ్ముడు హైదర్ నేడు షుకూర్ బిరియాని సెంటర్ ని పునః ప్రారంభించాడు. కాగా సోమవారం నుండి అన్ని రకాలా మాంసాహార వంటకాలు ఇక్కడ మరలా లభ్యం కానున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page