top of page

షూటింగ్ బాల్ జిల్లా అధ్యక్షుడిగా చల్లా

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Jun 10, 2023
1 min read

కడప జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా

చల్ల రాజగోపాల్ యాదవ్ ఎన్నిక

చల్లాను సన్మానిస్తున్న నూతన కార్యవర్గ సభ్యులు

ప్రొద్దుటూరు, నందిని క్లాత్ మార్కెట్ లో గల సీమాంధ్ర బీసీ సంఘం కార్యాలయం నందు శనివారం సాయంత్రం జరిగిన కడప జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక. కడప జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్లా రాజగోపాల్ యాదవ్, కార్యదర్శిగా అనిల్ కుమార్, కోశాధికారిగా శౌరి కుమార్, ఉపాధ్యక్షులుగా కే మమత చింటూ ఇమ్మానియేల్, సంయుక్త కార్యదర్శిగా దేవేంద్ర, కార్యవర్గ సభ్యులుగా సురేష్ కుమార్ రెడ్డి లను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన అడ్వకేట్ గంగిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ పరిశీలకుడిగా ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరుశరాముడు తోపాటు అడ్వకేట్ గంగిరెడ్డి హాజరయ్యారు. నూతన అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ మాట్లాడుతూ జులై నెలలో రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page