top of page

ఫిన్లాండ్ లో శిక్షణా కార్యక్రమానికి షేక్ జవహర్ మున్నీర్ ఎంపిక

  • Writer: EDITOR
    EDITOR
  • 7 days ago
  • 1 min read

ఫిన్లాండ్ లో శిక్షణా కార్యక్రమానికి షేక్ జవహర్ మున్నీర్ ఎంపిక

ప్రొద్దుటూరు ఆగష్టు : స్థానిక లింగారెడ్డి కొట్టాలు లోని మండల ప్రజా పరిషత్ స్కూలు ఉపాధ్యాయిని షేక్ జవహర్ మున్నీర్ ఆగస్టు 15న బయలుదేరి ఫిన్ ల్యాండ్ లో జరిగే శిక్షణా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, అభ్యాస నైపుణ్యాలను బలోపేతం చేయడానికి ఆగస్టు 17 నుండి 26 తేదీ వరకు ఫిన్లాండ్ లో జరగబోయే ఎఫ్ఎల్ఎన్ శిక్షణా కార్యక్రమంలో షేక్ జవహర్ మున్నీర్ పాల్గొంటారు. మొత్తం 29 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరవుతున్నారు. 2025 సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా షేక్ జవహర్ మున్నీర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. కడప జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన షేక్ జవహర్ మున్నీర్ ని ప్రొద్దుటూరు ఎంఈఓ సావిత్రి, ఎంఈఓ-2 శోభా రాణి, పలువురు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందించారు.


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
7 days ago
Rated 5 out of 5 stars.

👍CONGRATULATIONS MADAM

Like
bottom of page