top of page

సేవా సంకల్ప అభియాన్ : ప్రొద్దుటూరులో అంగన్వాడీ కేంద్రాల పరిశీలన

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 26
1 min read

సేవా సంకల్ప అభియాన్: ప్రొద్దుటూరులో అంగన్వాడీ కేంద్రాల పరిశీలన

అంగన్వాడీ పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇన్చార్జ్ శారద, రెడ్డి ప్రసన్న, బిజెపి నాయకులు
అంగన్వాడీ పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇన్చార్జ్ శారద, రెడ్డి ప్రసన్న, బిజెపి నాయకులు

వైయస్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితం, పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు చేపట్టిన 'సేవా సంకల్ప అభియాన్'లో భాగంగా సేవా సంకల్ప అభియాన్ ప్రొద్దుటూరు కన్వీనర్ బి. రెడ్డి ప్రసన్న ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో అంగన్వాడీ పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ కడప జిల్లా అధ్యక్షురాలు చేవూరు శారదమ్మ, ప్రొద్దుటూరు ఇంచార్జ్ వెంకట్, కో-కన్వీనర్ చెన్నై మోహన్ స్థానిక అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి సమీక్షించారు. కేంద్రాల్లో పిల్లలకు అందుతున్న పోషకాహారం, మౌలిక వసతులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నెలకొన్న సమస్యలను త్వరలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.


ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడమే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశమని నాయకులు పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి ప్రదీప్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఎం. కుమారి, జిల్లా కార్యదర్శి చిరంజీవి రెడ్డి, బీజేపీ ప్రొద్దుటూరు నగరం-1 పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్రరావు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు తుపాకుల చౌడయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు అఖిల, ప్రధాన కార్యదర్శి శ్రీశ్రీ తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page