top of page

ప్రొద్దుటూరులో రెండవ రోజు రిలే దీక్ష - నేతల సంఘీభావం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 7
  • 1 min read

ప్రొద్దుటూరులో రెండవ రోజు రిలే దీక్ష - నేతల సంఘీభావం

కడప జిల్లా, ప్రొద్దుటూరు (వాయిస్ ఆఫ్ హెరాల్డ్) : వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. DSC అక్రమాలపై CBI విచారణ, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు వెంటనే ఇవ్వాలని, ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మునిసిపల్ ఆఫీస్ మెయిన్ గేట్ ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి.


ఈ రోజు రాజుపాలెం మండలానికి చెందిన పలువురు నాయకులు, యువకులు, మహిళలు మరియు నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు దీక్షలో పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని సందర్శించిన మాజీ మునిసిపల్ వైస్ ఛైర్మెన్ పాతకోట బంగారు రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి నరసింహారెడ్డి, మాజీ కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, పిట్టా భద్రమ్మ తదితరులు నిరాహార దీక్షలో ఉన్న వారికి సంఘీభావం తెలిపారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, న్యాయం జరిగే వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page