top of page

సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కొత్తపల్లె సర్పంచ్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 3, 2024
  • 1 min read

సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కొత్తపల్లె సర్పంచ్

కడప జిల్లా, ప్రొద్దటూరు


కొత్తపల్లె పంచాయతీ మిట్ట బాలాజీ నగర్ లో 10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తపల్లె పంచాయతీ ఆటో నగర్ మిట్ట బాలాజీ నగర్ కాలనీలో నేడు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చొరవతో సీసీ రోడ్డుకి భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందని, అలాగే కొత్తపల్లి పంచాయతీ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఇంకా ఎక్కడైనా సమస్యలు కొత్తపల్లి గ్రామ ప్రజలు తమ దృష్టికి తెస్తే వాటిని కూడా పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. కొత్తపల్లి పంచాయతీ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 13వ వార్డ్ మెంబెర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, ఏ ఈ గణేష్, నంగునూరు పల్లె నాగేష్ యాదవ్, సుబ్రమణ్యం, షరీఫ్, శరత్, బాలాజీ నగర్ ప్రజలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page