top of page

విద్యుత్ షాక్‌కు గురైన పాలిటెక్నిక్ విద్యార్థి సందీప్ కోలుకోవడంపై హర్షం

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 23
1 min read

విద్యుత్ షాక్‌కు గురైన పాలిటెక్నిక్ విద్యార్థి సందీప్ కోలుకోవడంపై హర్షం: ఎమ్మెల్యే వరదకు, కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ కు కృతజ్ఞతలు

గణేష్ నిమజ్జనం పర్వదినాన సెప్టెంబర్ 20న విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిన 17 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి వెంకట సందీప్ ప్రాణాపాయం నుంచి బయటపడి ప్రస్తుతం నిలకడగా ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ప్రొద్దుటూరులోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి తక్షణమే స్పందించి, బాధితుడికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కమిషనర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి సందీప్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడమే కాకుండా, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


అనంతరం సందీప్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూలులోని ఆర్కా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడిని మూడు రోజుల పాటు ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్స అందించడంతో సందీప్ కోలుకున్నాడు. ప్రమాదం జరిగిన నాటి నుంచి కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ నిరంతరం వైద్యులతో సంప్రదింపులు జరుపుతూ కుటుంబానికి ధైర్యం చెప్పడం వల్లే సందీప్ త్వరగా కోలుకోగలిగాడని అతని మేనమామ కిరణ్ తెలిపారు. క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి, కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్‌కు సందీప్ తల్లి పద్మతో పాటు కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page