top of page

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా రుద్రయాగం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 17, 2023
  • 1 min read

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా రుద్రయాగం

రుద్రయాగం నిర్వహిస్తున్న బిజెపి నాయకులు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 73వ పుట్టినరోజు సందర్భంగా, ప్రొద్దుటూరులోని బిజెపి కార్యాలయం నందు నియోజకవర్గ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు రుద్రయాగం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా బిజెపి అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి హాజరుకాగా, నియోజకవర్గ, మండల స్థాయి బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని యాగాన్ని పరిసమాప్తం చేశారు. ఈ సందర్భంగా శశి భూషణ్ రెడ్డి మాట్లాడుతూ, ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశం గర్వించదగ్గ నేతగా మోదీ పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసి జాతి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింప చేసి భారతీయులకు ప్రత్యేక గుర్తింపు గౌరవం అందించారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు పి సుబ్రహ్మణ్యం, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page