ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీపీపీ స్టేజ్-4 ఏఎంసీ కార్మికుడు ఆది నారాయణ ఆవేదన
- EDITOR

- Aug 4
- 1 min read
ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీపీపీ స్టేజ్-4 ఏఎంసీ కార్మికుడు ఆది నారాయణ ఆవేదన
ఎలక్ట్రికల్, కోల్ క్లీనింగ్, యాష్ ప్లాంట్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఏఎంసీ కార్మికుల దయనీయ పరిస్థితి

వైఎస్సార్ కడప జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) స్టేజ్-4లో ఎలక్ట్రికల్, కోల్ క్లీనింగ్, కోల్ శాంపిల్ సూట్ జాములు యాష్ ప్లాంట్ తదితర విభాగాల్లో ఏఎంసీ (AMC) విధుల్లో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఎంసీ కార్మికుడు ఆది నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పరిష్కరిస్తున్నారు ఆర్టిపిపి ఏఎంసి కార్మికుల సమస్యలపై పలుమార్లు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు సమస్యను పత్రికల ద్వారా విన్నవించుకున్న పరిష్కారం చూపలేదని వాపోతున్నారు తాము ఎన్నో సంవత్సరాలుగా ఏఎంసీ కార్మికులుగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు, యాజమాన్యాలు విఫలమయ్యాయని అన్నారు. నెలకు కేవలం రూ.11,000 వేతనంతో కుటుంబాన్ని పోషించడం అసాధ్యంగా మారిందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, శుభకార్యాలు, ఇతర కుటుంబ అవసరాలు, రోజువారీ ప్రయాణ ఖర్చులు అన్నీ పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు.
ఆర్టీపీపీలో సుమారు 200 మంది ఏఎంసీ కార్మికులు ఇదే పరిస్థితిలో పనిచేస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, తక్కువ వేతనాలు, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా అనేక మంది కార్మికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యం వెంటనే స్పందించి ఏఎంసీ కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాల పెంపు, వంటి సంక్షేమ సౌకర్యాలు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు, దీర్ఘకాలంగా సేవలందిస్తున్న కార్మికులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆది నారాయణ డిమాండ్ చేశారు.






Comments