top of page

ఉద్యోగం ఇప్పిస్తానని బురడి కొట్టించిన ఆర్టీపీపీ ఉద్యోగి.

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 28, 2022
  • 1 min read

Updated: Apr 29, 2022

(ప్రసన్న ఆంధ్ర, జమ్మలమడుగు విలేకరి, ఆది) వైయస్సార్ జిల్లా,


ఉద్యోగం ఇప్పిస్తానని బురడి కొట్టించిన ఆర్టీపీపీ ఉద్యోగి, ఎర్రగుంట్ల ధర్మల్ పవర్ ప్రాజెక్టులో పర్మినెంటు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మ చెప్పి 20 లక్షల మేర వసూలు చేసి బురడా కొట్టించిన ఆర్టీపీపీ ఉద్యోగి జేపిఎ పొన్ను సూర్య నారాయణ. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు.

వివరాల్లోకెళ్తే, ఆర్టీపీపీ లో కాంట్రాక్టు కార్మికురాలిగా పనిచేస్తున్న కోట పావని 2018 లో జెఎఓ పోస్టుకు పరీక్షలు రాసింది. ఆపోస్టు రావాలంటే డబ్బులు ఖర్చు పెట్టు కుంటే వస్తుందని నమ్మి చెప్పి 20.39 లక్షలు వసూలు చేసుకొని ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాడు అని తెలిపిన బాధితురాలు. ఉద్యోగం లేకున్నా పర్లేదు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన భాదితురాలు. డబ్బులు అడిగితే చంపుతాననీ బెదిరిస్తున్నట్లు పోలీసుల ఫిర్యాదు లో పేర్కొన్న భాదితురాలు.


బాధితురాలి ఫిర్యాదు మేరకు పొన్ను సూర్యనారాయణ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెల్పిన ఎస్సై శివప్రసాద్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page