పల్లె రఘురామిరెడ్డి (RRR రఘు) వైసీపీలోకి
- VOICE OF HERALD

- Apr 19, 2024
- 1 min read
పల్లె రఘురామిరెడ్డి (RRR రఘు) వైసీపీలోకి


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ఎన్నికలు ఆసక్తిగా మారిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు నూతన చేరికలతో ఇరు పార్టీలు తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీనివాస నగర్ కు చెందిన ఏసీ వర్కర్స్ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ నెంబర్ ప్రొద్దుటూరు అసోసియేషన్ ప్రెసిడెంట్ పల్లె రఘురామిరెడ్డి (RRR రఘు) ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డిల సమక్షంలో వైసిపి కండువా ధరించారు. ఆయనతోపాటు పెన్నా నగర్ కు చెందిన జూటూరు పద్మావతి ఆధ్వర్యంలో మొత్తం నూరు కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ ఈ ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం తన వంతు సహాయ సహకారాలు అందించి గెలుపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ కీలక నేతలు, నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు, పాల్గొన్నారు.





Comments