top of page

ఏలూరు నగరంలో రౌడీ షీటర్ హల్చల్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 31, 2022
  • 1 min read

పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు నగరంలో రౌడీ షీటర్ హల్చల్, ట్రావెల్స్ ఆఫీస్ పై అనుచరులతో దాడి. ఆలస్యంగా వెళ్లి బస్ ని వెనక్కి రప్పించాలంటూ హుకుం, ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడతారు,కావాలంటే తరవాత బస్ లో ఎక్కిస్తాము అన్న ట్రావెల్ సిబ్బంది.

నేనెవరో తెలుసా అంటూ అనుచరులతో కలిసి ట్రావెల్ సిబ్బంది పై రౌడీ షీటర్ పైశాచిక దాడి. దగ్గరే ఉండి దాడిని ప్రోత్సహించిన రౌడీ షీటర్ భార్య, ఏలూరు అధికార పార్టీ మహిళా కార్పొరేటర్ భీమవరపు హేమ సుందరి, ట్రావెల్ ఆఫీస్ సిసిటివిలో రికార్డ్ అయిన రౌడీ షీటర్ దాడి దృశ్యాలు. పోలీసుల కి ఫిర్యాదు చేస్తే మళ్ళీ వచ్చి కొడతాం అంటూ బెదిరింపులు. ఏలూరు 3వపట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.


ఏలూరులో రౌడీ షీటర్ భీమవరపు సురేష్ ఆగడాలు. గత నెలలో ఏలూరు 2వపట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ ని బెదిరించి కోట్ల రూపాయల ఆస్తి కాజేసే యత్నం ఘటన పై ఏలూరు 2వ పట్టణ స్టేషన్లో కేసు నమోదు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page