top of page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 7, 2023
  • 1 min read

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


మండల పరిధిలోని వెంకట రాజంపేట వద్ద మంగళవారం వెంకట రాజంపేట అరుంధతి వాడకు చెందిన కొండూరు వెంకటేష్ (63) అనే వ్యక్తిని రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రున్ని స్థానికులు చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతుడిని తిరిగి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page