రూ.28 లక్షలు విలువ చేసే ఎర్రచందనం, కార్, ఐచర్ వాహనం పట్టివేత
- VOICE OF HERALD

- Jan 12, 2022
- 1 min read
కడప జిల్లా, ఒకవైపు ప్రభుత్వం పోలీసు అధికారులు ఎర్రచందనం స్మగ్గ్లింగ్ అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి స్మగ్గ్లింగ్ ని అరికట్టే ప్రయత్నాలు ఎన్ని చేసినా అక్రమార్కులు మాత్రం తమ పంధా నేర వృత్తి ప్రవృత్తి మార్చుకోవటం లేదు వివరాల్లోకి వెళితే రాయచోటి పట్టణం కడప రోడ్డు మార్గంలోని అక్రమంగా రవాణా చేస్తున్న 19 ఎర్రచందనం దుంగలను అలాగే 10 మంది తమిళ కూలీలతో పాటు ఒక కారు ఐచర్ వాహనాన్ని స్వాధీన పరుచుకున్నారు పోలీసులు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలు వాహనాల విలువ సుమారు ఇరవై ఎనిమిది లక్షలకు పైగా ఉండవచ్చునని డిఎస్పీ శ్రీధర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాగా పట్టుబడిన తమిళ కూలీలా పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు, ఈ సమావేశంలో రాయచోటి పట్టణ ఇంచార్జ్ సిఐ లింగప్ప, యస్ ఐ లు నరసింహ రెడ్డి, మహమ్మద్ రఫీ సిబ్బంది పాల్గొన్నారు.



Comments