top of page

ప్రమాదంలో బయటపడ్డ రేషన్ బియ్యం అక్రమ రవాణా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 25, 2022
  • 1 min read

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాల వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో రేషన్ బియ్యం ను అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. ఆత్మకూరు నుండి నెల్లూరుకు అక్రమంగా రేషన్ బియ్యం ను తరలిస్తున్న లారీ రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఎద్దుల బండిని డీ కోని అదుపుతప్పి లారీ రోడ్డు పక్కన పడిపోవడంతో రేషన్ బియ్యం బస్తాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.ఈ ప్రమాదంలో ఓ ఎద్దు చనిపోగా బియ్యంబండి నడుపుతున్న డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను తెలుసుకొని అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. ఆత్మకూరు నుండి నెల్లూరు కు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page