top of page

రాష్ట్రీయ హిందూ వాహిని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా గొర్రె శ్రీనివాసులు

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 22, 2024
  • 1 min read

రాష్ట్రీయ హిందూ వాహిని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా గొర్రె శ్రీనివాసులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధ్యక్షులుగా ప్రొద్దుటూరు నియోజకవర్గ బిజెపి కన్వీనర్ ప్రముఖ న్యాయవాది గొర్రె శ్రీనివాసులను నియమించినట్లు రాష్ట్ర హిందూ వాహిని జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర దివేది తెలిపారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని జాతీయ కార్యాలయం నందు శ్రీనివాసులు సంస్థ గుర్తింపు కార్డు అందుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి చేతుల మీదుగా గొర్రె శ్రీనివాసులు నియామక పత్రాలు అందుకోనున్నారు. తనను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినందుకు సంస్థ అధ్యక్షునికి సభ్యులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజులలో సంస్థ ద్వారా కార్యక్రమాలు చేపట్టి సంస్థ బలోపేత దిశగా అడుగులు వేస్తామని ఆయన భరోసానిచ్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page