top of page

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 18, 2022
  • 1 min read

అటు ప్రభుత్వాలు ఇటు పోలీసులు అత్యాచార ఘటనలపై ఉక్కు పాదం మోపి నేరస్తులను కఠినంగా శిక్షిస్తున్నా, గతంలో సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నేరస్థుల పై దుమ్మెత్తిపోశారు నెటిజన్లు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా నేరస్తులను వారి మాధ్యమాలలో పదే పదే చూపించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన సందర్భాలు కోకొల్లలు. కానీ కొందరు వారి కామ వాంఛ తీర్చుకొనటానికి మైనర్ లను బలి తీసుకుంటున్నారు, చట్టాలు ఎన్ని మారినా ఇలాంటి మనస్తత్వం కలవారిని మార్చలేక పోతున్నాయి అనేదానికి ఈరోజు ప్రొద్దుటూరు లో జరిగిన సంఘటనే సాక్షం. ఏది ఏమయినా ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే...


కడప జిల్లా, ఎర్రగుంట్ల (మం) చెందిన మైనర్ బాలికపై అత్యాచారం. ప్రొద్దుటూరులోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక. బాలికను ద్విచక్రవాహం లో ఎక్కించుకొని తీసుకెళ్లి అత్యాచారం, నిందితుడు ప్రొద్దుటూరు మొడంపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page