top of page

బాలికపై అత్యాచారయత్నం... కేకలు వేయడంతో..!

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 12, 2022
  • 1 min read

గుంటూరు జిల్లా (గురజాల)


బాలికపై అత్యాచారయత్నం... కేకలు వేయడంతో..!

ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నాపెద్దా తేడా లేదు... ఆడపిల్ల అయితే చాలు... అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఐదేళ్ల బాలికపై ఓ కీచకుడు లైంగిక దాడికి యత్నించాడు.బాలిక కేకలు వేయడంతో పారిపోయాడు. వివరాల్లోకి వెళితే...

పల్నాడు జిల్లా గురజాల మండలం వెంకటనగర్ కాలనీలో దారుణం జరిగింది, కాలనీలో నివసిస్తున్న ఐదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారయత్నం చేశాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో యువకుడు అక్కడినుంచి పారిపోయాడు, గమనించిన స్థానికులు.. ఈ విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు, అనంతరం డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page