top of page

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు - రాజంపేట లో కలకలం

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 11, 2023
  • 1 min read

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు - రాజంపేట లో కలకలం

మేడాకు వ్యతిరేకంగా గోడమీద వెలసిన పోస్టర్లు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డికి వ్యతిరేకంగా గోడలపై పోస్టర్లు వెలియడంతో రాజంపేటలో కలకలం రేగింది. మంగళవారం రాజంపేట పట్టణంలో అక్కడక్కడా మా నమ్మకం నువ్వే జగనన్న., కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి.. మీ మీద మాకు నమ్మకం లేదు అని సంబోధిస్తూ ఇట్లు.. మోసపోయిన వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు అంటూ గోడల మీద పోస్టర్లను అంటించారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జగనన్న నువ్వే మా భవిష్యత్తు"- "మా నమ్మకం నువ్వే జగన్ " అనే కార్యక్రమానికి సంబంధించిన టైటిల్ ను వినియోగించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ అదే సమయంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పైన విశ్వాసం లేదంటూ నిరసన రూపంలో పోస్టర్లను అంటించడం పట్టణంలో చర్చనీయాంశమైంది. వెంటనే తేరుకున్న మేడా వర్గీయులు పోస్టర్లను తొలగించారు. అయితే మేడా వర్గంలో అసంతృప్తి వర్గం ఈ పని చేశారా లేదా మేడా వ్యతిరేకవర్గం చేశారా అన్నది తెలియాల్సి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page