రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి - జనసేన
- EDITOR

- Apr 11, 2023
- 1 min read
రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి - రాజంపేట జనసేన నాయకులు


ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ రాజంపేట జనసేన నాయకులు ప్రజలను కోరారు. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు "పవనన్న ప్రజా బాట" కార్యక్రమం నియోజకవర్గం లోని పాపరాజుపల్లి, బాలి రెడ్డి గారి పల్లి, కోపు తదితర గ్రామాలలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ రూపొందించిన సిద్ధాంతాలు, ఆశయాలు, హామీలతో కూడుకున్న కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర అభివృద్ధికై జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని రాజంపేట జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, నాయకులు భాస్కర పంతులు, పోలిశెట్టి శ్రీనివాసులు, హేమంత్, చంగల్ రాయుడు, జనసేన వీర మహిళలు జెడ్డా శిరీష, మాధవి, జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.





Comments