top of page

రాచమల్లు సంచలన ఆరోపణలు - సీబీఐ విచారణ డిమాండ్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 11 minutes ago
  • 1 min read

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా స్కామ్‌పై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు సంచలన ఆరోపణలు - సీబీఐ విచారణ డిమాండ్

కడప జిల్లా, ప్రొద్దుటూరు


డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం 372 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో అవినీతి చోటుచేసుకుందని, ఒక్కో ఉద్యోగాన్ని రూ.14 నుంచి రూ.15 లక్షల వరకు విక్రయించారని ఆయన ఆరోపించారు. "నాడు ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై ఎలా విచారణ జరిగిందో, అదే తరహాలో నేటి డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపైనా సీబీఐ విచారణ జరపాలని" రాచమల్లు డిమాండ్ చేశారు. ఈ రెండు వ్యవహారాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.


ఇదే సమయంలో అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు జరగడంపై కూడా రాచమల్లు తీవ్రంగా స్పందించారు. "డీఎస్సీ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈడీ సోదాలు జరుగుతున్నాయి" అంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని విమర్శించారు. ముఖ్యంగా జగన్ స్వయంగా డీఎస్సీపై సీబీఐ విచారణ కోరిన తర్వాతే ఈడీ సోదాలు మొదలయ్యాయని, ప్రజలు అసలు సమస్యను మర్చిపోయేలా చేయడానికే ఈ నాటకం అని ఆయన వ్యాఖ్యానించారు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page