top of page

ప్రొద్దుటూరులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు - అన్నదానం చేసిన మెగా అభిమానులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 1 hour ago
  • 1 min read

ప్రొద్దుటూరులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు - అన్నదానం చేసిన మెగా అభిమానులు

వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలలో భాగంగా ప్రొద్దుటూరులోని మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నేడు స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు చిరంజీవి మరియు ఆయన కుటుంబం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసి దేవుడిని ప్రార్థించారు.


ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు. వారిలో మధు చిరు రాయల్, షరీఫ్ టైర్స్, జనసేన అడ్వకేట్ రమేష్, రాము, బాబు రావు, చెన్న రవి, ఇమామ్, చల్లా రవికుమార్, సుదర్శన్, నెట్ బాష, సాగర్, నంద మెగా శ్యామ్, సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు. ఆశ్రమానికి వచ్చిన భక్తులకు, పేదలకు అన్నదానం చేసి మెగాస్టార్ జన్మదినాన్ని సేవా దినంగా జరుపుకున్నారు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page