top of page

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ నిధుల గోల్‌మాల్ : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు నిప్పులు

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 18
1 min read

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ నిధుల గోల్‌మాల్: ఈవీ సుధాకర్ రెడ్డి, టీడీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు నిప్పులు

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


కడప జిల్లా, ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్‌లో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బ్యాంక్ ఖాతాదారుల ప్రయోజనాల కోసమే తాను ప్రశ్నిస్తున్నానని, తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఈవీ సుధాకర్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సుచరిత అనే ఖాతాదారురాలికి చెందిన ఆధార్, పాన్ కార్డులు, ఫోటోలతో ఖాతా తెరిచి, ఆమె స్థానంలో ఉషారాణిని తీసుకెళ్లి రూ.11 లక్షలు అక్రమంగా డ్రా చేయడం ముమ్మాటికీ దొంగతనమేనని రాచమల్లు ఆరోపించారు. బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి కస్టమర్ భౌతికంగా లేకుండా ఎలా ఖాతా తెరిచారని, కస్టమర్ ఎవరో కూడా గుర్తించలేరా అని బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. సుధాకర్ రెడ్డి స్వార్థానికి బ్యాంకు ఉద్యోగులతో పాటు ఆ మహిళలు కూడా బలైపోయారని, సుచరిత సొమ్మును కాజేసిన ఉషారాణి, సుధాకర్ రెడ్డి ఇద్దరూ నేరస్థులేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని, న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తామని హెచ్చరించారు.


గత రెండున్నరేళ్లుగా తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, తాను భూములు లాక్కున్నట్లు కానీ, రూపాయి అవినీతి చేసినట్లు కానీ రుజువుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, మేనిఫెస్టో సిద్ధం చేసి చంద్రబాబు వద్దకు వెళ్లాలని సవాల్ విసిరారు. అదే సమయంలో వరదరాజుల రెడ్డి, కొండారెడ్డిల అవినీతిపై తాను మేనిఫెస్టో ఇస్తే ఎస్ఎస్ మాల్ నుంచే వారి బాగోతాలు బయటపడతాయని హెచ్చరించారు. ప్రొద్దుటూరులో కొందరు వ్యక్తులకు తనపై మాట్లాడే నైతిక స్థాయి లేదని, వారు ఏ దారిలో వస్తే తాను అదే దారిలో ఎదుర్కొంటానని తేల్చిచెప్పారు. బ్యాంకుల్లో అక్రమాలు చేస్తూ ఖాతాదారులకు బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా వ్యవహరించవద్దని ఆయన హితవు పలికారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page