వరదరాజుల రెడ్డిపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిప్పులు: ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్

వరదరాజుల రెడ్డిపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిప్పులు: ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, స్థానిక నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చెప్పే మాటలకు, చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండదని మండిపడ్డారు. గతంలో నన్ను అంతమొందించేందుకు సైతం వరద కుట్రలు పన్నారని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేత చల్లా రాజగోపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "నీ ఇంట్లోనే జూదం ఆడించి మేజులు తీసుకున్నావు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తే నాలుక కోస్తా..
తాను కులమతాలకు అతీతంగా బతికే వ్యక్తినని, రాజకీయంగా తనపై ఎన్ని నిరాధార నిందలు వేసినా భరించానని రాచమల్లు స్పష్టం చేశారు. అయితే తన వంశ ప్రతిష్టకు, కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా ఎవరైనా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని, నాలుక కోస్తానని తీవ్రంగా హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమని ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.
ఎన్నికల సవాల్‌ను స్వీకరిస్తున్నా: నేరుగా బరిలోకి దిగుదాం!
వరదరాజుల రెడ్డి విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు రాచమల్లు ప్రకటించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఇద్దరం ఇండిపెండెంట్‌గా తేల్చుకుందామని సవాల్ విసిరారు. "మున్సిపల్ చైర్మన్ పదవికి నా కుమారుడు రాఘవేంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉంటాడు. నీవు కూడా నీ కుమారుడు కొండారెడ్డిని ఇండిపెండెంట్‌గా బరిలోకి దించు.. ప్రజాక్షేత్రంలో ఎవరి బలం ఎంత ఉందో నిరూపించుకుందాం" అంటూ ప్రత్యర్థికి రాచమల్లు సూటిగా సవాల్ చేశారు.




Comments