top of page

అప్రజాస్వామిక విధాన సాధనాలుగా ఈవీఎం, ఎస్.ఐ.ఆర్ - రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 17
  • 1 min read

అప్రజాస్వామిక విధాన సాధనాలుగా ఈవీఎం, ఎస్.ఐ.ఆర్ - రాచమల్లు

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


స్థానిక వైవిఆర్ కళ్యాణ మండపం వద్దగల రాచమల్లు తోట లో ఇవాళ ఏర్పాటు చేసిన వై.యస్.ఆర్.సి.పి బూత్ ఏజెంట్ల సమావేశంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకొని నాడు ఈవీఎం ల ద్వారా అప్రజాస్వామిక విధానంతో కూటమి ప్రభుత్వం గెలిచిందని, నేడు ఎస్.ఐ.ఆర్ ను సాధనంగా చేసుకొని కూటమి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని మై టిడిపి యాప్ ద్వారా వై.యస్.ఆర్.సి.పి ఓటర్లను గుర్తించి వారి ఓట్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనిపై వై.యస్.ఆర్.సి.పి బూత్ ఏజెంట్ లు తమ బూత్ పరిధిలో సమగ్రంగా ఓటరు వివరాలను పొందుపరచాలని, క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ వారు ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే సంబంధిత ఎలక్షన్ అధికారులకు సమాచారం అందించాలని, ప్రతీ వై.యస్.ఆర్.సి.పి బూత్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండాలని, రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అనే నేను ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో ఏదైనా అనుమానాలుంటే తమను సంప్రదించాలని, పార్టీ ఏజెంట్లకు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని, అలాగే క్షేత్ర స్థాయిలో ప్రతీ వైసీపీ నాయకులు తమ బూత్ ఏజెంట్లకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబందించిన పలువురు నాయకులు, బూత్ ఏజెంట్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page