చంద్రబాబు పాలన అంటేనే వాతలు, కోతలు, ఎగవేతలు - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
- VOICE OF HERALD

- Aug 5
- 1 min read
చంద్రబాబు పాలన అంటేనే వాతలు, కోతలు, ఎగవేతలు - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

కడప జిల్లా, ప్రొద్దుటూరు
చంద్రబాబు నిన్న ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "చంద్రబాబు పాలన అంటేనే వాతలు, కోతలు, ఎగవేతలు" అని వ్యాఖ్యానించారు. గత 26 నెలల టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, లక్ష కోట్ల సంక్షేమం ఇచ్చామంటున్నా ప్రజలకు ఒక్క రూపాయి కూడా అందలేదని ఆరోపించారు. "అబద్ధాలు, అవినీతి, మోసం, వెన్నుపోటు ఇదే చంద్రబాబు అజెండా" అని విమర్శించారు. 3 లక్షల 65 వేల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఆర్భాటపు మాటలు, తప్పుడు ఆరోపణలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు కొండంత హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక గోరంత కూడా ఇవ్వలేదని అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నిజమైన సంక్షేమం జరిగిందని రాచమల్లు కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ. 1 లక్ష 31 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశారని తెలిపారు. కేవలం 2 సంవత్సరాల్లోనే 8 కోట్ల 89 లక్షల మంది లబ్ధిదారులకు, 1 కోటి 41 లక్షల కుటుంబాలకు DBT, నాన్-DBT ద్వారా నేరుగా డబ్బులు అందించామని గుర్తు చేశారు. 69 వేల కోట్లు సామాజిక పింఛన్ల రూపంలో ఇచ్చిన ఘనత జగన్‌దేనని, హామీ ఇచ్చిన వెంటనే పథకాలు అమలు చేశామని చెప్పారు. "సంపద సృష్టించడం అంటే సంతానాన్ని కనడం" అని చెప్పిన చంద్రబాబు, హామీలను ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని రాచమల్లు సవాల్ చేశారు.





Comments