top of page

7వేల మందితో రా కదలి రా సభకు - మాజీ ఎమ్మెల్యే వరద వెల్లడి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 17, 2024
  • 1 min read

7వేల మందితో రా కదలి రా సభకు - మాజీ ఎమ్మెల్యే వరద వెల్లడి

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వరద, పాల్గొన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


19వ తేది శుక్రవారం కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గం నందు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న 'రా కదలి రా' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం స్థానిక అభ్యాస్ జూనియర్ కళాశాల నందు పలువురు టిడిపి నాయకులు, వరద అభిమానులు, ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని వారి అభిప్రాయాలను తెలుసుకొని చర్చించారు. 7వేల మంది నాయకులు, కార్యకర్తలతో సభకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, గ్రామ వార్డు స్థాయి టిడిపి నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page