జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా జయప్రదం చేయండి - ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వ్యవసాయ కార్మిక సంఘం
- VOICE OF HERALD

- 1 hour ago
- 1 min read
ఈనెల 24 సామాజిక శంఖారావంలో గ్రామాల్లో వచ్చిన సమస్యలపై జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా జయప్రదం చేయండి - ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వ్యవసాయ కార్మిక సంఘం

శనివారం ఉదయం కొత్తపల్లె గ్రామ పంచాయతీ లో సామాజిక శంఖారావం పేరుతో పర్యటించిన సందర్భంలో వచ్చిన ప్రజల సమస్యల పై ఈనెల 24 కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల అధ్యక్షులు పాలజీ శేఖర్, కార్యదర్శి గుర్రం డేవిడ్ లు మాట్లాడుతూ నెల రోజులుగా సామాజిక శంఖారావం పేరుతో జిల్లాలో గ్రామీణ పేదల వాడలు దళిత పేటలు ప్రజా సంఘాల ఆధ్వర్యం నాయకులు మండలాల్లో గ్రామాలలో పట్టణ వార్డులలో పర్యటించారు. భూమి లేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు భూమి ఇళ్ల స్థలాలు పట్టాలు పక్కా గృహాలకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని తెలిపారు. జిల్లాలో ఐదువేల ఎకరాలు దళితులకు జెడ్.హెచ్.డి క్రింద భూములకు 40 సంవత్సరాల నుంచి దళితులు సాగు చేస్తున్న అందరికీ పట్టాలు ఆన్లైన్ రైతు భరోసా సౌకర్యాలు కల్పించాలని కోరారు.
కూటమి ప్రభుత్వం మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ఎన్నికలలో వాగ్దానం చేశారని ఇప్పటికీ అమలు చేయలేదు వెంటనే అమలు చేయాలని కోరారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు పై సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఈనెల 24వ తేదీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు పెద్ద ఎత్తున గ్రామీణ పేదలు దళితులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి నోవా, కమిటీ సభ్యులు సుజాత, రమణమ్మ, లక్ష్మీ, రాజి, భాను, మేరీ, సన తదితరులు పాల్గొన్నారు.



Comments