top of page

ఇంటి, కుళాయి పన్నులు కట్టలేదని సీజ్ నోటీసులు, కుళాయి కనెక్షన్ కట్ చేస్తున్న సచివాలయం సిబ్బంది

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 11, 2022
  • 1 min read

పెదగంట్యాడ (ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి)


హౌస్ టాక్స్ , వాటర్ టాక్స్ కట్టలేదని సీజ్ నోటీసు అలాగే వాటర్ కనెక్షన్ కట్ చేస్తున్న సచివాలయం సిబ్బంది. గత కొంత కాలంగా ఎన్నో విధాలుగా చెబుతున్నప్పటికీ కూడా ప్రజలు పట్టించుకోని విధంగా వ్యవహరిస్తున్నారని వారి యొక్క హౌస్ టాక్స్ లు అలాగే వాటర్ టాక్స్ లు విపరీతంగా బకాయి ఉండటంచేత జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు సచివాలయం సిబ్బంది వారికి ప్రజలకు హౌస్ టాక్స్ ,వాటర్ టాక్స్ కట్టమని ఎన్ని విధాల చెప్పిన ,వాలంటీర్ల పంపించి గుర్తు చేసిన, ప్రజలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని దానిమీద సచివాలయం సిబ్బంది యాక్షన్ తీసుకోవడం జరిగినది. ఈరోజు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నడుపూరు, ఎస్ టి కాలనీ, రామచంద్ర నగర్, గ్రామాలలో కొన్నిచోట్ల జప్తు నోటీసులు, వాటర్ కలెక్షన్ లో కట్ చేయడం జరిగినది. సచివాలయ సిబ్బంది వారి యొక్క విధులు నిర్వహిస్తూ వాటర్ కలెక్షన్ అలాగే హౌస్ కి జప్తు నోటీసులు ఇవ్వడం జరిగినది. ఇందులో భాగంగా పెదగంట్యాడ- టు సచివాలయం అడ్మిన్ అరుణ మహిళా పోలీస్ , శానిటైజర్ సిబ్బంది హేమ , మౌనిక ,ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రశాంత్ ఇతర సచివాలయం సిబ్బంది వాలంటీర్లు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page