ఎమ్మెల్యే వరద ఆధ్వర్యంలో రేపు SIRపై అవగాహన సదస్సు
- VOICE OF HERALD

- Jun 9
- 1 min read
ఎమ్మెల్యే వరద ఆధ్వర్యంలో రేపు SIRపై అవగాహన సదస్సు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రేపు అనగా బుధవారం 10వ తారీఖున ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో కొరపాడు రోడ్డులోని ఎస్కేఎస్సీ డిగ్రీ కళాశాల నందు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ పునః పరిశీలన (SIR) పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు, ఇందుకు సంబంధించి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జిలు, బిఎల్ఎలు, నాయకులు ఉదయం 10 గంటలకు ఎస్.కే.ఎస్.సి డిగ్రీ కళాశాల నందు జరిగే SIR కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయం నుండి పత్రికా ప్రకటన వెలువడింది.




Comments