top of page

ప్రొద్దుటూరు వాసులకు ఘోర రోడ్డు ప్రమాదం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 30, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చెందిన యువకులకు ఘోర రోడ్డు ప్రమాదం, ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు. వివరాల్లోకి వెళితే స్థానిక 35వ మునిసిపల్ వార్డు కాన్సెలర్ పిట్టా బాలాజీ దగ్గరి బంధువు అయిన షణ్ముఖ తన స్నేహితులతో కలిసి ఏపీ 04 ఏఎఫ్ 1899 ఫోర్డ్ కారులో ప్రొద్దుటూరు నుండి వీరపునాయునిపల్లి కి వెళ్లి తిరుగు ప్రయాణంలో అతివేగంగా అటుగా వెళ్తున్న ట్రాక్టర్ ని ఢీ కొన్నారు, కారులో ప్రయాణిస్తున్న షణ్ముఖ, దినేష్, రాజేష్ లకు గాయాలయ్యాయి. ఇందులో షణ్ముఖ, దినేష్ లకు తీవ్ర గాయాలు కాగా వారిని ప్రొద్దుటూరులోని సురక్ష ఆసుపత్రికి తరలించారని సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించనున్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page