పది రూపాయల మాస్కా పది లక్షల హాస్పిటల్ బిల్లా - ట్రాఫిక్ సీఐ
- VOICE OF HERALD

- Jan 10, 2022
- 1 min read
కడపజిల్లా, ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్లో ఈరోజు మరోమారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సింహా తన సిబ్బందితో మాస్కులు ధరించని పాదాచారులు వాహనదారులకు మాస్క్ యొక్క ప్రాధాన్యత తెలియచేస్తూ ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పొందటానికి మాస్కును తప్పని సరిగా ధరించాలని లేని పక్షంలో కరోనా భారిన పడక తప్పదని "10 రూపాయల మాస్క్ కావాలా లేదా 10 లక్షల హాస్పిటల్ బిల్ కావాలా" అంటూ మాస్కు ధరించని ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి మాస్కు ఉచితంగా ఇచ్చి వారికి ధరింపచేశారు, ప్రజలు కూడా మాస్క్ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని ట్రాఫిక్ పోలీసు వారికి కృతజ్ఞతలు తెలియచేశారు.



Comments