top of page

స్వర్ణకారుల సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 9, 2024
1 min read

ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం నూతన కమిటీని గత నెల 18వ తేదీన ఎన్నుకోగా, సోమవారం సాయంత్రం నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ వారిచే మెయిన్ బజార్ లోని స్వర్ణకారుల సంఘం భవనం నందు ప్రమాణ స్వీకారం చేయించారు. సంఘానికి ఐదు మందితో కూడిన గౌరవాధ్యక్షులు, ప్రెసిడెంట్ ఉప్పలూరు ఇలియాస్ భాష, సెక్రటరీ బోగా బాల వీరయ్య, ట్రెజరర్ టి మౌలాలి, వైస్ ప్రెసిడెంట్లు గా మహబూబ్ బాషా, శివరాం, నూర్ మొహమ్మద్, హుస్సేన్, దౌలా, జాయింట్ సెక్రెటరీలుగా వెంకట్, ఖలీల్ బాషా, శ్రీధర్, అక్రమ్, కృష్ణ ప్రమాణ స్వీకారం చేయగా, కమిటీ మెంబర్లుగా మరో 56 మందిని ఎంపిక చేశారు. నూతన కమిటీ బాధ్యత స్వీకరించిన వారిని శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు తాలూకాలోని స్వర్ణకారులు హాజరయ్యారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page