top of page

ప్రొద్దుటూరులో దారుణం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 14, 2023
  • 1 min read

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని గోపవరం పంచాయతీ, నక్కలదిన్నె గ్రామంలో కసాయి తండ్రి తన కొడుకు, కూతురుపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, అనంతరం తాను పురుగుల మందు ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


వివరాల్లోకి వెళితే, నక్కల దీన్నే గ్రామంలో నివాసముండే బసిరెడ్డి నరసింహారెడ్డి ప్రొద్దుటూరులోని ఒక ఫర్టిలైజర్ షాప్ లో పనిచేస్తు భార్యా పిల్లలతో నక్కలదిన్నె గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఏమి జరిగిందో ఏమో తెలియదు గానీ భార్యతో గొడవపడి ఒక రూములో నిర్బంధించి, అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన కొడుకు రవితేజ, కూతురు పావనీ లపై శుక్రవారం అర్ధరాత్రి గొడ్డలితో అతి కిరాతకంగా దాడి చేసి వారిని తీవ్ర గాయాలపాలు చేశాడు, పురుగుల మందు ద్రావణం తాగిన నరసింహా రెడ్డిని, గాయాల పాలైన రవితేజ, పావనీ లను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యం అందించే లోపు నర్సింహారెడ్డి మృతిచెందాడని, మెరుగైన చికిత్స కోసం రవితేజ పావనీ లను హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. కాగా మృతుడు బసిరెడ్డి నరసింహారెడ్డికి మతిస్థిమితం సరిగా లేదని ఇందుకు సంబంధించి అటు మృతుడి బంధువులు కానీ, నక్కల దీన్నే గ్రామస్తులు గాని ఎటువంటి సమాచారం పాత్రికేయులకు వెల్లడించకపోవడం ఇక్కడ గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page