top of page

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 52 వార్డులుగా పునర్విభజన

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 14
1 min read

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 52 వార్డులుగా పునర్విభజన

వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపాలిటీని 52 వార్డులుగా విభజిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. పట్టణ పరిపాలన మరియు అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు 1994 పురపాలక నిబంధనల ప్రకారం ఈ సరిహద్దుల పునర్విభజన ప్రక్రియ అధికారికంగా ఖరారైంది. ఈ తాజా విభజన వివరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికార పత్రంలో అధికారికంగా ప్రచురించారు.

పౌరులు, ఓటర్ల అవగాహన కోసం వార్డుల సమగ్ర వివరాలతో కూడిన ప్రపత్రం-6ను ముఖ్య కార్యాలయాలలో ప్రదర్శనకు ఉంచారు. ప్రజలు ఈ విభజన వివరాలను ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం, జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, స్థానిక పురపాలక సంఘ నోటీసు బోర్డులలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ముఖ్యంగా ఓటర్లు స్వయంగా పరిశీలించవచ్చని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ టి. శ్రీనివాస్ విశ్వనాథ్ పత్రిక ప్రకటన ద్వారా సూచించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page