top of page

మున్సిపాలిటీలో ఫోటోల రగడ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 20, 2024
  • 1 min read

మున్సిపాలిటీలో ఫోటోల రగడ

కడప జిల్లా, ప్రొద్దుటూరు


తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫోటోలు ఎందుకు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డితో వావి వివాదానికి దిగారు. వెంటనే వారి ఫోటోలు తొలగించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టాలంటూ పట్టుబట్టారు. కమిషనర్ రఘునాథ్ రెడ్డి తన సిబ్బందిని పంపించి మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫోటోలు తొలగించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటో పెట్టించారు. వైసీపీ అధికారం కోల్పోయిన కొంతమంది అధికారుల తీరులో ఇంకా మార్పు రాలేదంటూ టిడిపి నేతలు విమర్శించారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page